Pilot Rohith Reddy : ఫామ్‌హౌస్ కేసు నుంచి డ్రగ్స్ కేసు వరకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పైలట్ !

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రాజకీయ సంచలనాలకు వేదికైన ఈ ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది.

New Update
rohit

బీఆర్ఎస్(BRS Party) మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Pilot Rohith Reddy) కి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రాజకీయ సంచలనాలకు వేదికైన ఈ ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది. శనివారం రాత్రి ఈ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రోహిత్ రెడ్డితో పాటు మరికొందరు అడ్డంగా దొరికిపోయారు. వీరిలో ఏపీ టీడీపీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నారు. పట్టుబడిన వారందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

సరిగ్గా మూడేళ్ల క్రితం అంటే 2022 అక్టోబర్‌లో కూడా ఇదే ఫామ్‌హౌస్ వార్తల్లో నిలిచింది. అప్పట్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇక్కడే బయటపడింది. అప్పట్లో ఆ ఎమ్మెల్యేలకు రూ. 100 కోట్లు ఆశ చూపారన్న వీడియోలు బయటకు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పట్లో ఆ వివాదం బీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఎన్నికల్లో కలిసి వచ్చింది. 

Also Read :  మేడిపల్లిలో ఘోర ప్రమాదం: కారు ఢీకొని దంపతుల మృతి, కుమారుడికి గాయాలు!

హీరోలా నిలిచిన పైలట్

ఒకప్పుడు తన ఫామ్‌హౌస్‌(farmhouse) లో ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసి హీరోలా నిలిచిన పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు అదే ఫామ్‌హౌస్‌లో నిందితుడిగా దొరికిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఫిర్యాదు చేసిన ఆయనే, ఇప్పుడు డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కడం ఒక వింతగా మారింది. చాలాకాలంగా వివాదాలకు పైలట్ రోహిత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ గా  ఉంటున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే రోహిత్ రెడ్డి యంగ్ లీడర్స్ పేరుతో  ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు నిర్వహించేవారు. రిటైర్డ్ ఆర్మీమెన్ రక్షణార్థం ఆయుధాల లైసెన్స్ ఇవ్వగా.. రోహిత్ రెడ్డి వారిని పర్సనల్ సెక్యూరిటీగా నియమించుకొని ఆయుధాలను దుర్వినియోగం చేశారని అప్పట్లో తాండూరులో ఓ కేసు కూడా ఆయన పేరు మీద  నమోదైంది. ఆ తర్వాత తాండూరులో భారీ కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బందులు కలిగించారని న్యూసెన్స్ కేసు కూడా నమోదు చేశారు. తాండూరు రాఘవేంద్ర నగర్ కాలనీలో అనుమతుల్లేకుండా షెడ్డు వేశారని మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య సదరు షెడ్డును కూల్చారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రోహిత్ రెడ్డి ఎక్కడా కూడా తగ్గలేదు. హైదరాబాద్‌లో ఇంటెలిడెక్స్ కంపెనీ చెక్‌బౌన్స్ కేసు నమోదు చేసింది. ఇ
 
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంట్ ఎన్నికల్లోనూ దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు కొత్త తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో దొరకడం పార్టీ పరువు తీస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. డ్రగ్స్ విషయంలో తమ పార్టీ చాలా కఠినంగా ఉంటుందని గతంలో కేసీఆర్ ప్రకటించారు. మరి ఇప్పుడు తన పార్టీ మాజీ ఎమ్మెల్యేనే డ్రగ్స్ వాడుతూ దొరికిపోవడంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రోహిత్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు ఉంటాయా లేదా? అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

Also Read :  రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి 70 లక్షల మంది ఖాతాల్లో 3,590 కోట్లు

Advertisment
తాజా కథనాలు