నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ఆయన స్పందించడం లేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల ముఖ్య నేతలు ఆయనను పరామర్శిస్తున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం గారిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ మంత్రులు దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్,… pic.twitter.com/AZwgLDF4zU — Office of Harish Rao (@HarishRaoOffice) December 26, 2024 బీఆర్ఎస్ నేతల పరామర్శ.. బీఆర్ఎ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద గౌడ్, మాజీ మంత్రులు దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు జగన్నాథంను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జగన్నాథం త్వరలో కోలుకుని ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.