High Court: హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్స్!

మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రాజెక్టు అవకతవకలపై భూపాలపల్లి కోర్టు జూలైలో పంపిన నోటీసులు కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

author-image
By srinivas
New Update
hari

హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్యాష్ పిటిషన్

TG News : మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే అంశంపై భూపాలపల్లిలో కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా దీనిపై విచారణ జరపాలని భూపాలపల్లి కోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం కేసీఆర్, హరీష్ రావుకు జూలైలో నోటీసులు పంపింది. అయితే తాజాగా ఆ నోటీసులు కొట్టివేయాలని వారిద్దరూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశారు. 

Also Read :  అల్లు అర్జున్‌కి మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ

Also Read :  శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్రజా ధనం వృథా అయిందంటూ..


ఇక మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో సరైనా రూల్స్ పాటించకుండా నిర్మాణాలు చేపట్టారని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా దీనివల్ల ప్రజాధనం భారీగా వృథా అయిందంటూ ఫిటిషనర్ పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేపట్టిన జిల్లా న్యాయస్థానం జులై 10న కేసీఆర్‌, హరీశ్‌రావు సహా మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌రావు సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీరి పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థాం.

ఇది కూడా చదవండి: R Ashwin: అశ్విన్‌ను అవమానించారు.. రోహిత్, గంభీర్‌పై మాజీలు ఫైర్!

Also Read :  ముట్టుకున్నా ఊరుకోం.. బౌన్సర్లకు సీపీ ఆనంద్ వార్నింగ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు