Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్!

హైదరాబాద్-నిజాంపేట్ ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

New Update
Hyderabad Nizampet fitness studio near by Fire accident

Hyderabad Nizampet fitness studio near by Fire accident

హైదరాబాద్‌ (Hyderabad) లో రోజు రోజుకు అగ్ని ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. తరచూ ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది మరువక ముందే ఇప్పుడు హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

Also Read: 15 వేల కోట్ల వారసత్వ సంపద సైఫ్‌ కు వస్తుందా..లేక చేజారేనా!

టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం

నిజాంపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ఒక్క సారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ - నిజాంపేట్ ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Also Read: ఇండియాలో అడుగుపెట్టిన ఇండోనేషియా ప్రెసిడెంట్.. షెడ్యూల్ ఇదే!

అలాగే పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడున్నవారంతా హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. అనంతరం సమీప స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Also Read: జమ్మూ కశ్మీర్‌ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు!

కార్ల షోరూంలో మంటలు

హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. 

షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. షోరూమ్ లో 30కి పైగా కార్లు ఉన్నాయని అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పారు. అవన్నీ మంటలకు ఆహుతి అయిపోయాని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు