Hyderabad: హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్!
హైదరాబాద్-నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.