TG News: రైతు భరోసాపై సీఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో సూచించారు. జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని తెలిపారు. ఇవన్నీ రైతు భరోసా నుంచి మినహాయింపు.. ఈ మేరకు శుక్రవారం రైతు భరోసాపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్.. రైతు భరోసాపై కీలక సూచనలు చేశారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వకూడదని చెప్పారు. సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలని తెలిపారు. అక్కరకు రాని భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని, అలాంటి భూముల జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కూడా సీఎం చర్చించారు. ఇది కూడా చదవండి: TTD: క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు! ఇక జనవరి 26 నుంచి రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ స్కీమ్ లో భాగంగా ప్రతి సంవత్సరం రూ. 12 వేలు పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. గత ప్రభుత్వంలో ఈ స్కీమ్ రైతు బంధుగా ఉండగా దీనిని రేవంత్ సర్కార్ రైతు భరోసాగా మార్చింది. అప్పుడు రూ. 10 వేలు ఉండగా ఇప్పుడు మరో 2 వేలు పెంచి ఇవ్వనుంది. ఇది కూడా చదవండి: TGPSC: రేవంత్ సార్ మా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి.. గ్రూప్-4 అభ్యర్థుల వినతి!