BSNL: కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ఫుల్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారు. ఈరోజు మొదటి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి.
కర్ణాటకలో మంత్రులు సహా చాలామంది హనీట్రాప్‌లో చిక్కుకోవడం దుమారం రేపుతోంది. హానీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. ఇందులో ఎవరినీ కూడా రక్షించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మోదీ ఫొటోలతో ఆయన పోస్ట్ చేశారు. ప్రజలే నా బలం అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు.
మహిళ వక్షోజాలను తాకడం అత్యాచారయత్నం కాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఖండించారు. ఇలాంటి తీర్పులతో సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందన్నారు. కేసు మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు.
తిరుమల క్యూ లైన్ లో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది. మాటల యుద్ధం కాస్తా కొట్టుకోవడం వరకు వెళ్లింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు.
ఆఫ్ఘానిస్తాన్ లో మరోసారి భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.