Andhra Pradesh : అమెరికా టారిఫ్ తగ్గింపు..ఏపీ రైతులకు గుడ్ న్యూస్!
ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ రైతుపై దాడి చేసిన చిరుత అతన్ని ఈడ్చుకెళ్లింది. పశువులను మేపేందుకు తన పొలానికి వెళ్లిన రైతును అప్పటికే అక్కడ మాటువేసిన చిరుతపులి డిచేసి అతన్ని లాక్కెళ్లింది. అడవిలో గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది.
ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పంట వ్యర్థాలు దహనం చేస్తున్న కొందరిని జైలుకు పంపిస్తేనే మిగతా వాళ్లకి వార్నింగ్ ఇచ్చినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.
సోమవారం రైతుల ఖాతాల్లోకి ఫసల్ బీమా యోజన నిధులు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతులకు ఈ స్కీమ్ కింద రూ.3200 కోట్లు జమకానున్నాయి. రాజస్థాన్‌లోని జుంజునులో జరగనున్న కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ నిధులు విడుదల చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్ కింద రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో రెండో విడత డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈకేవైసీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే కావని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ రైతు కుటుంబాలకు ధీమానిచ్చే రైతు బీమాను అటకెక్కిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. రైతు బీమా పథకంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని ఆరోపించారు.