YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!

భారత క్రీడా ప్రపంచానికి ఈ 2024 ఏడాది మరువలేని అనుభూతులను మిగిల్చింది. అద్భుత విజయాలతో మన ఆటగాళ్లు ప్రపంచ వేదికలపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించారు. టీ20 వరల్డ్ కప్ నుంచి అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ వరకు ఈఏడాది మన దేశం సాధించిన విజయాల లిస్ట్ ఈ ఆర్టికల్‌లో..

New Update
SPORTS

SPORTS Photograph: (SPORTS)

మరికొద్ది రోజుల్లో 2024 సంవత్సరం పూర్తికాబోతుంది. అయితే ఆ ఏడాదిలో అన్ని రంగాల కంటే క్రీడా రంగం దేశానికి గుర్తుండిపోయే అవార్డులను తీసుకొచ్చింది. అందులో క్రికెట్, చెస్, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ కూడా ఉన్నాయి. పురుషుల జట్టు ప్రపంచ కప్ నుంచి ఇటీవల జరిగిన చెస్ వరల్డ్ ఛాంపియన్ వరకు భారత ఆటగాళ్లు క్రీడారంగంలో ఎన్నో రికార్డులను సృష్టించారు. మరికొన్ని రోజుల్లో ఇయర్ ఎండ్ కావడంతో ఈ ఏడాది భారత ఆటగాళ్లు సాధించిన టాప్ 5 క్రీడా విజయాలేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్‌ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

టీ20 ప్రపంచ్ కప్‌గా భారత్

ఈ ఏడాదిలో భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలిచి దేశానికి గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. ఫైనల్‌లో సౌత్‌‌ఆఫ్రికాను చిత్తుగా ఓడించి భారత్ ఘన విజయం సాధించింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత భారత్ ఈ టీ20  ప్రపంచ్ కప్‌ను గెలుచుకుంది. దీంతో యావత్తు భారత్ సంతోషసాగరంలో మునిగిపోయింది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో 2007లో భారత్ మొదటి టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఆ తర్వాత మళ్లీ ప్రపంచ్ కప్ సాధించడం ఇదే. 

ఇది కూడా చూడండి: అల్లు అర్జున్ ఇష్యూ.. దిల్ రాజ్‌ని అడ్డంగా ఇరికించిన నిర్మాత నాగవంశీ

ఒలింపిక్స్‌లో మను భాకర్ రికార్డులు

యువ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్-2024లో దేశానికి తొలి పతాకాన్ని అందించింది. ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ షూటర్‌గా మను భాకర్ రికార్డు సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఫైనల్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతాకాన్ని తీసుకొచ్చింది. 

చరిత్ర సృష్టించిన నీరజ్ 

పారిస్ ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌ విభాగంలో నీరజ్ చోప్రా భారత్ నుంచి తొలి బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించాడు. 

ఇది కూడా చూడండి: Junior NTR : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే

పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటిన అథెట్లు

భారత్ అథ్లెట్లు పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటారు. మొత్తం 19 మెడల్స్‌ను అధ్లెట్స్ గెలుచుకున్నారు. ఇందులో మన తెలుగువారికి చెందిన వారు కూడా ఉండటం విశేషం. 

యంగెస్ట్ చెస్ ఛాంపియన్ గుకేష్

వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్ దొమ్మిరాజు సరికొత్త రికార్డును ఈ ఏడాది సృష్టించాడు. ఇటీవల జరిగిన ఫిడే ఛాంపియన్స్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్‌ను భారత్‌కు తీసుకొచ్చాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గుకేశ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. 18 ఏళ్ల వయస్సులోనే ఛాంపియన్ టైటిల్‌ను సొంతం చేసుకుని యావత్తు ప్రపంచం భారత్ వైపు చూసేలా చేశాడు. 

ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!

Advertisment
Advertisment