బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ ఘోర ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో మ్యాచ్‌లో 4వ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మైదానంలో లేడు. దీంతో ఏమైందని అందరూ కూడా ఆందోళన చెందారు. వెన్నునొప్పి కారణంగా మైదానం నుంచి వెంటనే బుమ్రా ఆసుపత్రికి వెళ్లాడు. అయితే మొదటి ఇన్నింగ్స్‌లోనే బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. కానీ మ్యాచ్ ఆడాడని తర్వాత ఆడలేకపోవడం వల్ల మధ్యలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: TS: గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc — cricket.com.au (@cricketcomau) January 4, 2025 ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి బుమ్రా 2019లో లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో బాధపడ్డాడు. అప్పుడు బుమ్రా కోలుకోవడానికి దాదాపుగా మూడు నెలలు పట్టింది. ఆ తర్వాత 2023లో వెన్నుకి గాయం తగలడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అప్పుడు దాదాపుగా ఏడాది పాటు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వెన్ను నొప్పి ప్రారంభమైంది. దీంతో ఫ్యాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా? లేదా? అని ఆందోళనలో ఉన్నారు. ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్! ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా.. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో జస్ప్రీత్ ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఒకే సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన ఇండియా బౌలర్‌గా బుమ్రా 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1977-78 సీజన్‌లో బిషన్ సింగ్ బేడీ ఆడాడు. అప్పుడు 31 వికెట్లు బిషన్ సింగ్ పడగొట్టగా.. బుమ్రా ప్రస్తుతం 32 వికెట్లు పడగొట్టాడు. కొత్త ఏడాదిలో అత్యధిక బౌలింగ్ రేటింగ్ సాధించిన భారత బౌలర్ కూడా బుమ్రానే. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 907 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు