Flights : భయపెట్టిస్తున్న విమాన ప్రమాదాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు

గత 50 ఏళ్లలో విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విమానాల్లో ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాంకేతిక కారణాలతో అనేక విమానాలు కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది.

New Update
Flights : భయపెట్టిస్తున్న విమాన ప్రమాదాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు

Plane Accidents In Last 50 Years : 50ఏళ్లు.. దాదాపు 2 లక్షల మరణాలు.. ఇవి విమాన ప్రమాదాల్లో (Plane Accidents) చనిపోయిన వారి లెక్కలు..! విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే ట్రాన్స్‌పోర్ట్ ఇదే! గాల్లో ఉండగానే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి.. లేకపోతే సముద్రంలో మునిగిపోతాయి.. కనీసం డెడ్‌బాడీలు కూడా దొరకవు. ఇటివలీ 62 మందిని చంపిన బ్రెజిల్ విమాన ప్రమాదమైనా 1977లో దాదాపు 600 మందిని బలితీసుకున్న టెనిరైఫ్‌ విమాన ప్రమాదమైనా అందుకు ప్రధాన కారణం సాంకేతిక లోపమే. నిజానికి చాలా విమాన ప్రమాదాలు కంటికి చిక్కవు.. కొన్ని ప్రమాదాలు మాత్రం కెమెరాలకు చిక్కుతాయి.

Also Read:  తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం.. సెంటిమెంట్‌తో కొడుతున్న బీఆర్ఎస్‌

ఆగస్టు 22 1999లో చైనా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్-642 (Chennai Airlines Flight-642) కుప్పకూలింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ అయ్యింది. బ్యాంకాక్ నుంచి తైపీకి వెళ్తున్న ఈ విమన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ల్యాండింగ్‌కు సమయంలో నంబర్ 3 ఇంజిన్ రన్‌వేని తాకడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలో నెత్తుటితో తడిసిన తేది ఇది. బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దేశీయ ప్రయాణీకుల విమానాన్ని ఆల్‌ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 65 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానంతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 3 వేల మంది మరణించారు.

జూలై 19, 1989లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 232 (United Airlines Flight 232) క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది.. ఈ ప్రమాదంలో 112 మంది చనిపోయారు. 184 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఇది ఒకటి. డిసెంబరు 1, 1984లో అమెరికాలో మరో విమానం కూలిపోయింది. అయితే ఇది నాసా చేపట్టిన పరీక్ష. కావాలనే క్రాష్ ల్యాండ్‌ చేశారు. ఈ పరీక్ష తర్వాత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వీటిని ఆర్పడానికి దాదాపు రెండు గంటలు గంటలు సమయం పట్టింది. నవంబర్ 23, 1996లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 961 కుప్పకూలింది. అడ్డిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న ఈ విమానం ముందు హైజాక్‌కు గురైంది. ఆ తర్వాత ఇంధనం అయిపోయింది. దీంతో కొమొరోస్ దీవులలోని గ్రాండే కొమోర్ సమీపంలోని హిందూ మహాసముద్రంలో క్రాష్ -ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు హైజాకర్లతో సహా విమానంలోని 125 మంది ప్రయాణికులు చనిపోయారు.

Also Read: భయపెడుతున్న మంకీపాక్స్‌.. కేంద్రం కీలక ఆదేశాలు

మే 5, 2019లో ఏరోఫ్లాట్ ఫ్లైట్-1492 (Aeroflot Flight-1492) పై పిడుగు పడింది. దీని వలన ల్యాండింగ్ గేర్ కూలిపోయింది. రెక్కల నుంచి ఇంధనం చిమ్ముతూ వెంటనే మంటలు చెలరేగాయి. విమానం వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. విమానంలోని 78 మంది ప్రయాణికుల్లో 41 మంది మరణించారు. జూన్ 24, 1994లో ఫెయిర్‌చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ B-52 క్రాష్ అయ్యింది. ట్రైనింగ్‌ సెషన్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విమానంలోని నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఇలా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాదాలు చాలానే ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు