Explainer: గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్.. ఇంట్లో ఉన్న మీ బంగారానికి వడ్డీ.. మోదీ సంచలన స్కీమ్!

 విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఏడాది పాటు బంగారం కొనద్దని ప్రధాని మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రానికి 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' ఓ ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది.

New Update
What Is The Gold Monetisation Scheme? PM Modi’s Appeal Brings Focus Back On Idle Gold

What Is The Gold Monetisation Scheme? PM Modi’s Appeal Brings Focus Back On Idle Gold

 విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఏడాది పాటు బంగారం కొనద్దని ప్రధాని మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత విదేశీ మారక ద్రవ్యం నిల్వలపై ప్రభావండ పడటంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు బంగారం కొనవద్దని ఆయన కోరారు. కానీ ప్రధాని చేసిన ఈ ప్రతిపాదనపై జ్యువెలరీ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల కోట్ల మంది జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. 

దీనివల్ల దేశంలోని సుమారు 3.5 కోట్ల మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (AIJGF) తెలిపింది. ఈ క్రమంలోనే ఓవైపు విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకుంటూనే.. మరోవైపు లక్షలాది కుటుంబాల జీవనోపాధిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అందుకే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' ఓ ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్నటువంటి బంగారాన్ని వినియోగంలోకి తెచ్చి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ స్కీమ్ ఉద్దేశ్యం.

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే 

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ప్రజల వద్ద లేదా సంస్థల వద్ద వాడకుండా ఉన్న బంగారాన్ని బ్యాంకుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ స్కీమ్‌ను కేంద్రం 2015లో ప్రారంభించింది. కానీ ఇది ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 34,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా ఉంది. కానీ కేవలం 39 టన్నులు మాత్రమే ఈ పథకం కింద డిపాజిట్ అయ్యాయి. అయినాకూడా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పథకాన్ని పునరుద్ధరించాలని జ్యువెలరీ పరిశ్రమల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 24 శాతం పెరిగాయి. దీంతో దేశ ఖజానాపై సుమారు 72 బిలియన్ డాలర్ల భారం పడింది. 

ఈ పథకం ఎలా పనిచేస్తుందంటే

 వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తింపు పొందిన కేంద్రాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందుకు బదులుగా బ్యాంకులు డిపాజిట్ సర్టిఫికెట్లను ఇస్తాయి. స్వల్పకాలిక (1-3 ఏళ్లు), మధ్యకాలిక (5-7 ఏళ్లు), దీర్ఘకాలిక (12-15 ఏళ్లు) ప్రాతిపదికన వీటిని అందిస్తారు. వీటిపై బ్యాంకులు లేదా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వడ్డీ కూడా వస్తుంది. ప్రస్తుతం SBI, ICICI, HDFC వంటి ప్రధాన బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి.

అంతేకాదు ఈ స్కీమ్‌లో భాగంగా 'గోల్డ్ మెటల్ లోన్' సౌకర్యం కూడా ఉంటుంది. బ్యాంకులు వినియోగదారుల నుంచి సేకరించిన బంగారాన్ని ఆభరణాలు తయరుచేసేవాళ్లకు రుణంగా ఇస్తాయి. దీంతో జ్యువెలర్లు రూపాయిలకు బదులుగా నేరుగా బంగారాన్నే రుణంగా పొందే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రుణ కాలపరిమితి 180 రోజులు ఉంది. ఒకవేళ ప్రజలు ఈ స్కీమ్‌లో పెద్ద ఎత్తున భాగస్వామ్యంగా చేరితే బంగారం దిగుమతులపై దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ కరెన్సీని ఆదా చేసుకోవచ్చు. అలాగే ఆభరణాల రంగాన్ని కూడా సంక్షోభం నుండి రక్షించే ఛాన్స్ ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు