యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం యూపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్వ్యూల కోసం ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. ఫలితాలు తెలుసుకునేందుకు https://upsconline.nic.in/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. Also read: తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్..రప్పా రప్పా అంటూ బీజేపీ పోస్టర్ వార్.. ఇదిలాఉండగా ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు UPSC గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. జులై 1న ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక త్వరలోనే ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇందులో అర్హత సాధించిన వారికి ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ అలాగే ఇతర కేంద్ర (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) సర్వీసులకు ఎంపిక చేస్తారు. Also Read: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు Also Read: అదానీ, మోదీతో రాహుల్ గాంధీ ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్