/rtv/media/media_files/2026/05/13/pm-modi-reduces-convoy-to-just-2-cars-2026-05-13-20-01-27.jpg)
PM Modi reduces convoy to just 2 cars
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో ఇంధనాన్ని పొదుపు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీ తన అధికారిక కాన్వాయ్‌ల సంఖ్యను భారీగా తగ్గించుకొని ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్ అంటే 12 నుంచి 15 వాహనాలు ఉంటాయి. కానీ తాజాగా కేవలం రెండు వాహనాలతోనే ఆయన ప్రయాణించడం విశేషం. దీనికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
PM modi is truly leading from the front! In line with his repeated appeals for austerity & fuel conservation, he has drastically reduced his convoy with only 2 vehicles spotted during recent visits.
— Aayush (@Oyeaayussh) May 13, 2026
A powerful example of simplicity and self-restraint. While we applaud this… pic.twitter.com/FPrpurot5Q
Also read: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమాన సర్వీసులు తగ్గింపు
ఇంధన పొదుపే లక్ష్యంగా కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ప్రధాని మోదీ స్వయంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌లో ఉండే మెర్సిడెస్ లగ్జరీ కార్లు, రేంజ్ రోవర్లు, ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాల సంఖ్యను భారీగా తగ్గించేశారు. వాహనాల సంఖ్య తగ్గించినాకూడా.. ఆయన వెళ్లే దారుల్లో తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తామని తెలిపారు.
Also Read: అమెరికా ముందు పాక్ ను అడ్డంగా ఇరికించిన చైనా.. భలే దెబ్బ కొట్టిందిగా!
మరోవైపు ప్రధానమంత్రి పిలుపు మేరకు స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్‌ల సంఖ్యను రెండు వాహనాలకే తగ్గించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉన్నత స్థాయిలోని రాజకీయ నేతలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది.
Follow Us