ప్రతీరోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ప్రజల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని పేర్కొన్నారు. చట్టాలంటే ప్రస్తుతం ప్రజలకి భయం,గౌరవం లేదని వ్యాఖ్యనించారు. Also Read: ఢిల్లీ ప్రజలకు ఊరట.. మెరుగుపడ్డ గాలి నాణ్యత రెడ్ సిగ్నల్స్ పడితే ఆగరు రోడ్డు ప్రమాదాలను నియంత్రించే చర్యలపై గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నితిన్ గడర్కీ సమాధానాలిచ్చారు. '' రోడ్డు ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, సమర్థంగా చట్టాలు అమలు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం.. ఈ నాలుగు అంశాలు కీలకంగా ఉన్నాయి. ఇక్కడున్న సమస్య ఏంటంటే.. ప్రజలకు చట్టంపై భయం, గౌరవం లేవు. రోడ్డుపై రెడ్ సిగ్నల్ పడితే ఆగరు. వాహనంపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకారు. నిన్ననే నా కళ్లముందు ఓ కారు రెడ్‌సిగ్నల్ దాటి పోయింది. కేవలం హెల్మెట్ ధరించని కారణంగా ప్రతీ ఏడాది కనీసం 30 వేల మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. నాకు కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. నేనూ బాధితుడినే. Also Read: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు మహారాష్ట్రలో విపక్ష నేతగా ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. అందుకే ఇది నాకు చాలా సున్నితమైన అంశం. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా.. ప్రతీ సంవత్సరం 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాలు సరిగ్గా అమలు చేయకపోవడమే ఇందుకు కారణం. ప్రజాప్రతినిధులు, మీడియా, సమాజం నుంచి సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం కాని పని. జరిమానాలు పెంచినా కూడా ప్రజలు నిబంధనలు పాటించడం లేదని'' నితిన్ గడ్కరీ వివరించారు. అలాగే ఈ అంశంపై లోక్‌సభలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలని కోరారు. Also Read: PSLV-C59 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సోమనాథ్ Also Read: Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట...అల్లు అర్జున్ టీమ్‌పై కేసు