ప్రస్తుతం నడుస్తున్నది అంతా సోషల్ మీడియా కాలం. అప్పుడే పుట్టిన పాపాయి దగ్గర నుంచి పండు ముదుసలి వరకూ చేతిలో ఫోన్..దాంట్లో సోషల్ మీడియా లేకుండా ఉండడం లేదు. ఇది పిల్లల మీ చాలా ప్రభావం చూపిస్తోంది. అందుకే దీనికి సంబంధించి చాలా దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రీసెంట్‌గా ఆస్ట్రేలియా చిన్న పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. వాట్సాప్‌తో సహా ఏదీ వాడకూడదని స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. ఇప్పుడు భారత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. Also Read: HMPV వైరస్ తీవ్రత తక్కువే.. చైనా సంచలన ప్రకటన అనుమతి తప్పనిసరి.. పిల్లలకు సోషల్ మీడియా (Social Media) అనుమతి తప్పనిసరి చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ప్రకారం.. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల పర్మిషన్ కచ్చితంగా ఉండాల్సిందే. ఫ్రిబ్రవరి 18 వరకు దీని మీద అభిప్రాయలను సేకరించనున్నారు. వాటి ఆధారంగా, అభ్యంతరాలకు అనుగుణంగా ముసాయిదాలో మార్పులు చేసి చట్టాన్ని తీసుకురానుంది కేంద్రం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY), తన నోటిఫికేషన్‌లో, MyGov.in ద్వారా ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలను సమర్పించడానికి ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 18 వరకు వీటిని స్వీకరిస్తారు. Also Read: Manipur: మణిపూర్‌లో మళ్ళీ మొదలైన గొడవలు..ఎస్పీ ఆఫీస్ పై దాడి కొత్త రూల్స్ పిల్లల వ్యక్తిగత డేటాని కాపాడేందుకు ప్రయత్నిస్తాయి. వారికి సోషల్ మీడియా నుంచి భద్రతను కల్పిస్తాయి. దీని ప్రకారం తల్లిదండ్రులు ఆమోదించారని నిర్ధారించే వరకు సంస్థలు పిల్లల వ్యక్తిగత డేటాను ఉపయోగించడం లేదా సేవ్ చేసుకోవడం లాంటివి చేయలేరు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు కూడా వీటిపై కఠినంగా ఉండాలి. వినియోగదారులు తమ డేటాను తొలగించాలని డిమాండ్ చేయడానికి, వారి డేటాను ఎందుకు సేకరిస్తున్నారనే దాని గురించి తెలుసుకునే పారదర్శకతను అనుమతించాలి. వీటిని ఉల్లంఘిస్తే రూ. 250 కోట్ల వరకు పెనాల్టీని కట్టాల్సి ఉంటుందని ప్రతిపాదించనున్నారు. Also Read: AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు Also Read: ఇండియాలోకి చైనా వైరస్ కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన