వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై తాజాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతగానే పోటీ చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆప్-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయని, కాంగ్రెస్‌కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ Arvind Kejriwal ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా సొంతంగానే పోటీచేస్తామని ప్రకటించారు. తాజాగా మళ్లీ పొత్తు అంశం వెలుగులోకి రావడంతో మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ ఇప్పటికే తమ అభ్యర్థులతో కూడిన రెండు జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు విడుతల్లో మొత్తంగా 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. కేజ్రీవాల్ ఇటీవలే జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అనంతరం ప్రజలు మళ్లీ గెలిపించేవరకు సీఎం పదవిలో ఉండబోనని కొన్ని నెలల క్రితం ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయగా.. మంత్రి అతిషి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. Also Read: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ Also Read: 11 లక్షల 70 వేలమంది బడి మానేశారు..ఎక్కువగా ఎక్కడ అంటే? ఇదిలాఉండగా.. ప్రస్తుతం సీఎం బంగ్లా వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. తాను సామాన్యుడని చెప్పుకునే సీఎం కేజ్రీవాల్.. అధికారంలో ఉన్న సమయంలో రూ.కోట్లు ఖర్చు చేసి సీఎం ఇంటికి మార్పులు చేశారని బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రాష్ట్రప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం ఉంది. మరోవైపు దీన్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే వాళ్లు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడింది. Also Read: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!