బాలల దినోత్సవం తేదీ మార్పు.. కిషన్‌ రెడ్డి సంచలన కామెంట్స్

బాలల దినోత్సవంపై కిషన్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇకనుంచి బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న కాకుండా డిసెంబర్ 26 వీర్ బాల్ దినోత్సవంగా చేయాలని ఆలోచిస్తున్నామన్నారు.

New Update
Kishna reddy

Kishna reddy

బాలల దినోత్సవంపై కిషన్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇకనుంచి బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న కాకుండా డిసెంబర్ 26 వీర్ బాల్ దినోత్సవంగా చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉండగా..2022 జనవరి 9న ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. గురు గోబింద్ సింగ్ కుమారులు.. సాహిబ్‌జాదాస్ బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ జీల బలిదానం గుర్తుగా డిసెంబర్ 26వ తేదీని 'వీర్ బాల్ దివస్'గా పాటించనున్నట్లు పేర్కొన్నారు. 

ప్రతీ ఏడాది నవంబర్ 14న దివగంత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నెహ్రూకి చిన్న పిల్లలు ఇష్టమనే కారణంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్‌ 14ను బాలల దినోత్సవంగా ప్రకటించింది. అయితే మోదీ ప్రభుత్వం నవంబర్ 14కు బాలల దినోత్సవానికి సంబంధం లేదని చెబుతోంది. ఈ క్రమంలోనే బాలల దినోత్సవాన్ని మారుస్తూ.. డిసెంబర్ 26న వీర్ బాల్ దినోత్సవంగా పాటిస్తామని పేర్కొంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు