మధ్యప్రదేశ్ హైకోర్టు సహజీవనానికి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు వెలువరించింది.పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ కేసులో తీర్పును జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ సింగిల్ బెంచ్ తీర్పుని వెలువరించారు. పిటిషనర్లిద్దరు 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉన్నాయని కోర్టు వివరించింది. ఇకపై బయటి వారి జోక్యం చేసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తుకు సవాలు... కానీ, కోర్టు యువతి చిన్న వయసులోనే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని నిర్ణయించుకునే నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్తోమత లేకుండా, పరిణతిలేని దశలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వారి భవిష్యత్తుకు సవాలు ఏర్పరచవచ్చని కోర్టు సూచించింది. కాకపోతే పిటిషనర్, తన భాగస్వామితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని నిర్ణయించుకోయింది.ఈ కేసు విచారణలో భాగంగా.. “నా పరిస్థితులు నాకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి బలవంతం చేశాయి” అని ఆ బాలిక కోర్టుకు తెలిపింది. ఆమె పరిస్థితులను గౌరవిస్తూ.. కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. Also Read: Karnataka: ఉచిత బస్ ఎఫెక్ట్..అక్కడ 15 శాతం పెరిగిన ఛార్జీలు..మరి మన సంగతేంటో! భార్యాభర్తల హక్కులను పరిరక్షించాలని, బయటివారి నుండి జోక్యం లేకుండా వారిని సురక్షితంగా ఉంచాలని కోర్టు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు సమాజంలోని పరిస్థితులను బట్టి ఈ తీర్పును వెలువరించింది. ఇది సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఉదాహరణగా ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. Also Read: Pakistan: ప్రేమికురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యూపీ వాసి.. చివరికీ ఊహించని షాక్ అయితే ఆర్థిక, మానసిక పరిపక్వత లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుంది.మొత్తం మీద, ఈ తీర్పు వ్యక్తుల స్వేచ్ఛను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. స్వేచ్ఛతో పాటుగా బాధ్యతల నిర్వహణ అవసరమని కోర్టు తెలిపింది. Also Read: Ap: సంక్రాంతికి..60 ప్రత్యేక రైళ్లను నడపనున్న సౌత్ సెంట్రల్ రైల్వే! Also Read: Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్ డెక్కర్ నే