ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీల స్థాయిని అంచనా వేసే క్యూఎస్ ర్యాంకుల జాబితా తాజాగా విడుదలైంది. ఈసారి భారతీయ యూనివర్సిటీలకు మంచి గుర్తింపు వచ్చింది. పలు వర్సిటీలో మెరుగైన ర్యాంకులు సాధించాయి. సస్టయినబిలిటీ అంశంలో ఐఐటీ ఢిల్లీ క్యూఎస్ ర్యాంకింగ్స్ పట్టికలో 255 నుంచి 171కి వచ్చి సత్తా చాటింది. భారత్ నుంచి మొత్తం 78 యూనివర్సిటీలు ఈ ర్యాంకిగ్స్‌లో చోటు సంపాదించాయి. Also Read: బెళగావిలో రణరంగం..రిజర్వేషన్ల కోసం ఆందోళన అయితే భారత్ నుంచి టాప్ 10లో తొమ్మిది వర్సిటీలు తమ స్థానాలు మెరుగుపర్చుకున్నాయి. అలాగే కొత్తగా మరో 21 వర్సిటీలు ఈ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇక పర్యావరణ ప్రభావానికి సంబంధించి టాప్ 100 జాబితాలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్‌లు నిలిచాయి. పర్యావరణ ఎడ్యుకేషన్‌లో ప్రపంచంలో టాప్ 50 జాబితాలో బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) ప్రత్యేకతను చాటుకుంది. Also Read: ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో భారతీయ వర్సిటీలు మెరుగైన ర్యాంకులు సాధించడంతో లండన్‌కు చెందిన క్యూఎస్ సంస్థ ఉపాధ్యక్షుడు బెన్ సోటర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉన్న విద్యా వ్యవస్థకు ఇది అద్భుతమైన విజయమని తెలిపారు. అక్కడ ఉన్న యూనివర్సిటీలు స్థిరమైన విధానాలతో ముందుకెళ్తున్నాయని చెప్పేందుకు ఈ ర్యాంకింగ్సే ఉదాహరణగా అభివర్ణించారు. ఇదిలాఉండగా.. 107 దేశాలు, ప్రాంతాల నుంచి మొత్తం 1740 వర్సిటీలు ఈ ర్యాకింగ్స్ కేటాయించారు. అయితే ప్రపంచంలో నే మొదటి స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో నిలిచింది. ఈటీహెచ్ జ్యూరిచ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. Also Read: ఆధ్యాత్మిక ముసుగులో 20 మందిని భార్యలుగా.. మత నాయకుడికి 50 ఏళ్లు..