/rtv/media/media_files/2025/03/13/DKpDVXjSPaYnuE6v0bwa.jpg)
bird flu if you apply eggs on your body on Holi?
Holi 2025
హోలీ పండుగ వచ్చేసింది. మరికొన్ని గంటల్లో రంగుల హరివిల్లు కనిపించబోతుంది. మార్చి 14న అంటే రేపు.. చిన్నా, పెద్దా తేడా లేకుండా రంగు రంగులతో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకను జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా ఎంతో సరదా సందడి మధ్య హోలీ సంబరాల్లో మునిగితేలుతుంటారు. వాటర్‌లో కలర్‌లు కలిపి ఒంటి నిండా పూసుకుంటారు. కోడి గుడ్లతో రచ్చ రచ్చ చేస్తారు. టమోటాలు విసురుకుంటూ గోల గోల చేస్తారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
అయితే ఈ ఏడాది హోలీకి కాస్తంత జాగ్రత్త పడాలని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సంచలనంగా మారింది. ‘కోయ్ కోయ్ కోడ్ని కోయ్’ అన్నవారంతా.. ఇప్పుడు ఏ కోడిని కోయకుండా.. తినకుండా వెనక్కి తగ్గారు. కోడ్ని మాత్రమే కాదు.. కోడి గుడ్డును కూడా తినడానికి ప్రజలు భయపడ్డారు. వీటిపై ఎంతో మంది అవగాహన కల్పించారు. చికెన్, గుడ్లును ఫ్రీగా వడ్డించి పెట్టారు. కానీ కొందరిలో మాత్రం భయం పోలేదు.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
గుడ్లతో బర్డ్ ఫ్లూ సోకుతుందా?
ఏమో.. తింటే బర్డ్ ఫ్లూ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందనే భయంతో వాటిని పక్కన పెట్టేశారు. మరి ఇప్పుడు హోలీ సందర్భంగా కోడి గుడ్లును ఒంటికి పూసుకుంటే బర్డ్ ఫ్లూ సోకుతుందా? అనే అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే అవన్నీ వట్టి అపోహాలు మాత్రమేనని ఇంకొందరు కొట్టిపారేస్తున్నారు. కోడి గుడ్లు వల్ల బర్డ్ ఫ్లూ సోకదని లైట్ తీసుకుంటున్నారు.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
ఇదే విషయంపై మరికొందరు కొన్ని సూచనలు ఇస్తున్నారు. హోలీ రోజున గుడ్లు కొనుక్కుని భయం భయంతో ఆడుకోవడం కంటే.. వాటిని పేదవారికి దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఆ రోజున కోడి గుడ్లను, టమోటాలను వేస్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. వాటిని నేలపాలు చేయడం కంటే.. ఇతరుల ఆకలి తీర్చడం కోసం ఉపయోగిస్తే ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. ఎందుకైనా మంచిది.. గుడ్లను వంటిపై పూసుకోవడానికి కాస్త దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు.