దేశంలో HMPV వైరస్ విజృంభణ.. 7కు పెరిగిన కేసులు..అందరూ చిన్నారులే!

చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్​ మెటా న్యుమో వైరస్​ భారత్​లోకీ విస్తరించింది. సోమవారం ఏకంగా రెండు రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదై కలకలం సృష్టించాయి.

New Update
HMPV Virus Cases in Bangalore

HMPV Virus Cases in Bangalore

చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్​ మెటా న్యుమో వైరస్​ భారత్​లోకీ విస్తరించింది. సోమవారం ఏకంగా రెండు రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదై కలకలం సృష్టించాయి. వీటిలో గుజరాత్​లో 1, కర్ణాటక, నాగ్​పుర్​, తమిళనాడుల్లో రెండేసి హెచ్​ఎంపీవీ కేసులు నమోదు అయ్యాయి. పైగా ఈ వైరస్​ బారిన పడిన వారందరూ నెలల పిల్లలే కావడం గమనార్హం. 

అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది పాత వైరస్​ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం అంటుంది.సోమవారం బెంగళూరులో ఇద్దరు పసికందులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది  పడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో వారికి హెచ్​ఎంపీవీ వైరస్​ సోకినట్లు వైద్యులు గుర్తించారు. తరువాత చికిత్స అందించగా  మూడు నెలల చిన్నారి కోలుకుని, ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్​ కాగా, మరో చిన్నారి కూడా త్వరగా కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

Also Read: America: భీక‌ర‌ మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!

2 నెలల శిశువుకు కూడా..

భారత్​లోని (India) తొలి హెచ్​ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి చెప్పింది. చైన్నైలో మరో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు తాజాగా నిపుణులు గుర్తించారు. వారు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. అలాగే రాజస్థాన్​కు చెందిన 2 నెలల శిశువుకు కూడా ఈ వైరస్ సోకింది. వీరందరికీ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ శిశువులు తల్లిదండ్రులు ఎవరూ కూడా విదేశీ ప్రయాణాలు చేయలేదు. మరి ఈ వైరస్ ఎలా భారత్​లోకి వచ్చిందో తెలియలేదని వైద్యులు అంటున్నారు. 

Also Read: Earthquake: చైనా, టిబెట్ భూకంపాలు...ఇప్పటివరకు 53 మంది మృతి

దేశంలో హెచ్​ఎంపీవీ వైరస్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించిన విషయం తెలిసిందే. ఈ వైరస్‌ కొత్తదేమీ కాదని వివరించారు. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్‌, ఎన్‌సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. నడ్డా మాట్లాడుతూ..'' HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య రంగ నిపుణులు తెలిపారు. 2001లో ఈ వైరస్‌ బయటపడింది. చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాప్తిలోనే ఉంది. గాలి, శ్వాసక్రియ ద్వారా వ్యాపించే ఈ వైరస్ అన్ని వయసుల వాళ్లను ప్రభావితం చేయగలదు. చలికాలం, వేసవికాలం ప్రారంభంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఇటీవల వచ్చిన రిపోర్ట్స్‌ ప్రకారం చూసుకుంటే చైనాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి.   

ICMR, NCDC, ఆరోగ్యశాఖ.. చైనాతో సహా ఇతర దేశాల్లో పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని పరిశీలించి.. త్వరలో రిపోర్టును మనకు పంపిస్తుంది. ICMR, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌తో భారత్‌లో శ్వాసకోశ వైరస్‌లకు సంబంధించిన డేటాను సమీక్షించాయి. సాధారణ వ్యాధికారిక వైరస్‌లో ఎలాంటి పెరుగుదల లేదు. పరిస్థితులను గమనిస్తూ.. ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని'' జేపీ నడ్డా అన్నారు.

Also Read:Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

Also Read: USA: అమెరికాలో కెనడా విలీనం..అందుకే ట్రుడో రాజీనామా అంటున్న ట్రంప్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు