అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ శత్రువులు ఉన్నాకూడా మనుగడ ఎలా సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ కూడా సురక్షితంగా లేవని తెలిపారు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో అస్సామీలు మైనార్టీలుగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. '' బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, మయన్మార్‌తో మనకు సరిహద్దులు ఉన్నాయి. Also Read: మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నావ్..మోహన్ బాబు 12 జిల్లాల్లో అస్సామీలు ఇంకా మైనార్టీలుగానే ఉన్నారు. మనచుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ విజ్ఞానం, టెక్నాలజీని వినియోగించుకొని ఇజ్రాయెల్ బలమైన దేశంగా ఎదిగింది. ఇలాంటి దేశాల చరిత్రలు తెలుసుకోవాలి. అప్పుడే ఒక జాతిగా మనం మనుగడ సాగించగమని'' హిమంత బిశ్వ శర్మ అన్నారు. Also Read: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు మరోవైపు అస్సాం ఒప్పందం జరిగి 40 ఏళ్లు గడిస్తున్న కూడా బయటి శక్తుల నుంచి రాష్ట్రానికి ముప్పు తొలగిపోలేదని పేర్కొన్నారు. అలాగే ప్రతీరోజూ జనాభాలో మార్పు జరుగుతోందని.. రాష్ట్రంలో స్థానిక ఆదివాసీలు తమ హక్కులను కోల్పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం ప్రజలకు మరింత రక్షణ కల్పించే అస్సాం క్లాజ్ 6పై అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసిన ప్రతిపాదనలు అమలుచేయడంతో పాటు మరిన్ని చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించిందని పేర్కొన్నారు. Also Read: బెళగావిలో రణరంగం..రిజర్వేషన్ల కోసం ఆందోళన Also Read: హైదరాబాద్‌కు రానున్న ద్రౌపది ముర్ము.. సీఎస్ శాంతి కుమారీ కీలక ఆదేశాలు