/rtv/media/media_files/2026/03/15/assam-elections-2026-2026-03-15-13-19-39.jpg)
Assam Elections 2026
Assam Elections 2026: త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నిక(Assam Assembly elections) ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా తన అభ్యర్థుల జాబితా(congress-list) ను విడుదల చేస్తోంది. గతంలో మొదటి జాబితా విడుదల చేయగా తాజాగా 23మందితో కూడిన తన రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ఇప్పటివరకూ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది. తన రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది. మొదటి జాబితాలో 42 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక రెండో జాబితా విషయానికి వస్తే.. ఈ జాబితాలో పార్టీ సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిచ్చారు. వీరిలో అబ్దుల్ ఖాలీక్ ముఖ్యుడు. మాజీ ఎంపీ అయిన ఈయనను కొత్తగా ఏర్పడిన మండియా నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతుండటం గమనార్హం. ఆయనతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాజెద్ అలీ చౌదరి (బిర్సింగ్ జరువా), అబుల్ కలాం రషీద్ ఆలం (గోల్‌పారా ఈస్ట్), రకీబుద్దీన్ అహ్మద్ (చమారియా)లకు మరోసారి అవకాశం దక్కింది.వీరితో పాటు బిపుల్ గోగోయ్ (టింగ్ఖోంగ్), శంతను బోరా (న్యూ గువహటి), నూరుల్ ఇస్లాం (సృజన్‌గ్రామ్) వంటి నేతలు ఈ జాబితాలో అవకాశం దక్కించుకున్నారు.
Also Read : బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ? నేడు తేదీలను ప్రకటించనున్న ఎన్నికల కమిషన్
Assam Elections 2026
అసోం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. కాగా ఈసారి కూడా అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి మధ్య హోరాహోరీ పోరు నెలకొనే అవకాశం ఉంది. కాగా ఇప్పటివరకు ప్రకటించిన మొదటి జాబితాలో అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ (జోర్హాట్), ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా(నజీరా) పేర్లను ఆయా పార్టీలు ఖరారు చేశాయి.
ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలకు 15 స్థానాలను కేటాయించింది. వీటిలో సీపీఐ(ఎం), అసోం జాతీయ పరిషత్ (AJP) తదితర పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక రాయ్జోర్ దళ్ (Raijor Dal) పార్టీతో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో, ఆ పార్టీ కూటమి నుంచి విడిపోయి విడిగా పోటీ చేస్తోంది. గతంలో వరుస విజయాలతో అసోంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ గత 2016 నుంచి అధికారానికి దూరంగా ఉంది. ఈసారి ఎలాగైనా పట్టు సాధించి తిరిగి అసోం లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రచారంలో ముందంజలో ఉంది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
Also Read : కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 20 మంది విద్యార్థులకు గాయాలు!
Follow Us