/rtv/media/media_files/2026/03/27/trump-2026-03-27-07-49-20.jpg)
Trump Extends Pause On Iran Power Plant Strikes for 10 days
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కొరిక మేరకు ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయని చెప్పారు. యుద్ధానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫేక్ న్యూస్‌ను ఎవరు నమ్మోద్దని సూచించారు.
Also Read: కేంద్రం గుడ్‌న్యూస్.. డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా కోటి ఉద్యోగాలు
హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఇటీవల ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్‌తో చర్చలు జరుపుతన్నామని.. ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన సదుపాయాలపై దాడులు అయిదు రోజులకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. మళ్లీ ఇప్పుడు 10 రోజులకు వాయిదా వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ చర్చల్లో పురోగతి కనిపిస్తోందని కూడా తెలిపారు.
Also Read: ఖార్గ్ ద్వీపం చుట్టూ ఇరాన్ సీ ‘మైన్’ వ్యూహం.. అమెరికా అడుగు వేస్తుందా?
వాస్తవానికి అమెరికా, ఇరాన్ మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఛాన్స్ ఉందని చెబుతూనే అమెరికా పశ్చిమాసియాలో మరిన్ని బలగాలను మోహరిస్తోంది. మరోవైపు ఈ యుద్ధాన్ని ఆపే చర్చల్లో మేము పాల్గొనడం లేదని ఇరాన్ చెబుతోంది. గురువారం కూడా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అలాగే గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. UAE రాజధాని అబుదాబిలో మిస్సైల్స్‌తో దాడులు చేసింది. యూఏఈ వాటిని అడ్డుకోగా ఆ క్షిపణి శిథిలాలు కింద పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఒకరు భారత్, మరొకరు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
Follow Us