Donald Trump: ట్రంప్‌ పాలకవర్గంలో మరో భారత్‌ -అమెరికన్‌ వ్యాపారవేత్త!

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ సారి తన కార్యవర్గంలో ఇండో -అమెరికన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంలో భారత అమెరికన్‌ వ్యాపారవేత్త శ్రీరామ్‌ కృష్ణన్‌ను నియమించారు.

New Update
indian american

indian american

America: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ సారి తన కార్యవర్గంలో  ఇండో -అమెరికన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన నేతలకు ఆయన కీలక బాధ్యతలు అప్పగించారు.

Also Read: kadapa corporation: కడప కార్పొరేషన్‌ లో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే Vs మేయర్ వార్!

తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంలో మరో భారత అమెరికన్‌ వ్యాపారవేత్తకు స్థానం ఇచ్చారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వైట్‌హౌస్‌ సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ను నియమించారు.

Also Read: Donald Trump: మస్క్‌ అధ్యక్షుడవుతారా..?గట్టిగానే సమాధానమిచ్చిన ట్రంప్‌

అయితే, వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీలో సీనియర్‌ సలహాదారుగా శ్రీరామ్‌ కృష్ణన్‌ విధులు నిర్వహించనున్నారు. శ్వేథసౌధం ఏఐ క్రిప్టో జార్‌ డేవిడ్‌ ఒ శాక్స్‌తో కలిసి ఆయన పని చేయబోతున్నారు. కృత్రిమ మేధతో అమెరికన్‌ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోనున్నారని ట్రంప్‌ చెప్పారు.

Also Read: Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి!

దీనికి శ్రీరామ్‌ కృష్ణన్‌ స్పందిస్తూ కాబోయే అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.కాగా, తమిళనాడులోని చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్‌ అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ కంప్లీట్ చేశారు. 

Also Read: Ap: ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు

2007లో మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా కెరీర్‌ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌, యాహూ, ట్విటర్‌ (ఎక్స్‌), స్నాప్‌ లాంటి సంస్థలో ఉద్యోగం చేశారు. 2022లో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పుడు కృష్ణన్‌ అక్కడే ఉన్నారు. ఆ టైంలో సంస్థ తదుపరి సీఈఓగా కృష్ణన్‌ను నియమించే అవకాశం ఉందని ప్రచారం కూడా జరిగింది.

రెండో సారి అధ్యక్ష బాధ్యతలు అందుకునేందుకు సిద్దమవుతున్నట్లు రిపబ్లికన్ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అంతేనా..ట్రంప్‌ తీసుకునే నిర్ణయాల్లోనూ టెస్లా అధినేత ప్రభావం చాలానే కనపడుతుంది.

మస్క్‌ అమెరికా అధ్యక్షుడు అవుతారా ?..

దీంతో ఎలాన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు అవుతారా ?అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెసిడెంట్‌ కాలేరని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలిసారి అరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్‌ కాన్ఫరెన్స్‌ లో ట్రంప్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ మస్క్‌ అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ఆయన అధ్యక్షుడు కాలేరని నేను చెప్పగలను. ఎందుకో తెలుసా? ఆయన ఈ దేశంలో జన్మించలేదు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత అయిన మస్క్‌..దక్షిణాఫ్రికాలో జన్మించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం...అధ్యక్ష పదవిని చేపట్టబోయే  వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలంటూ ట్రంప్ సమాధానం ఇచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు