/rtv/media/media_files/2026/03/14/oil-2026-03-14-06-53-45.jpg)
Rs 2,000 crore daily loss, OMCs take Rs 20 per litre hit on petrol, Rs 45 on diesel
అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధం(iran israel war) ప్రారంభించడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతుల ఆగిపోతున్నాయి. చివరికి ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100 డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది. భారత్, చైనా నుంచి చమురుకు ఆర్డర్లు వస్తుండటంతో రష్యాకు లాభం చేకూరుతోంది. కానీ భారత్‌లోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు మాత్రం భారీగా నష్టం వస్తోంది. రోజుకు రూ.2 వేల కోట్ల నష్టం వస్తుందని తెలుస్తోంది.
Also Read: ఇండిగో సంస్థ బిగ్ షాక్. రేపటి నుంచే పెరగనున్న విమాన టికెట్లు
OMCs Take Rs 20 Per Liter Hit On Petrol - Rs 45 On Diesel
ఇరాన్‌తో యద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రవాణా ఛార్జీలు, నౌకల బీమా సుంకం పెరిగింది. దీంతో మన దేశీయ మార్కెటింగ్ కంపెనీలకు ఆర్థిక భారం పడుతోంది. అయితే దేశీయంగా రిటెయిల్ ధరలు మార్చకపోవడంతో లీటరు పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌పై రూ.45 చొప్పున నష్టం జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)లకు ప్రతిరోజూ రూ.2 వేల కోట్ల నష్టం జరుగుతున్నట్లు సిస్టమాటిక్స్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది.
Also Read: ఓమన్‌లో డ్రోన్ దాడి: ఇద్దరు భారతీయుల మృతి.. గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్!
ఇందులో చూసుకుంటే డీజిల్‌పై రూ.1650 కోట్ల నష్టం జరుగుతండగా పెట్రోల్‌పై రూ.350 కోట్లు నష్టం జరుగుతున్నట్లు పేర్కొంది. రష్యా చమురు ధర సైతం బ్రెంట్ ముడిచమురు కన్నా బ్యారెల్‌కు 28 డాలర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఖతార్ నుంచి కూడా గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో స్పాట్ LNG ధర ఒక నెలలో 50 శాతం పెరిగిపోయింది. దేశీయంగా గ్యాస్ సరఫరాలో 25 శాతం కోత పడగా.. గ్యాస్ కంపెనీలపై కూడా ప్రభావం చూపిస్తోంది. - OMC Case
Follow Us