Modi-Netanyahu: 'దాడులు ఆపండి'.. నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్‌..

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు.

New Update
PM Modi speaks to Israel PM Netanyahu

PM Modi speaks to Israel PM Netanyahu

ఇరాన్ సుప్రీం లీడర్(Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ(ayatollah-ali-khamenei) మృతితో మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(pm modi) ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు(benjamin-netanyahu) తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి వైపు అడుగులేసేలా చర్యలు తీసుకోవాలని నెతన్యాహుకు సూచించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. '' ప్రస్తుతం జరుగుతున్న ప్రాంతీయ పరిస్థితులపై ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో మాట్లాడాను. ఈ పరిణామాలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపాను. 

Also Read: ఖమేనీ మరణం.. ఇరాన్ మసీదుపై ఎర్ర జెండా.. ఎందుకో తెలుసా ?

పౌరుల భద్రతే ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించాను. శత్రుత్వాలను నిలిపివేయాల్సిన అవసరాన్ని భారత్‌ మరోసారి పునరుద్ఘాటిస్తోందని'' రాసుకొచ్చారు. మరోవైపు ఇరాన్‌.. యూఏఈపై చేసిన దాడులను కూడా ప్రధాని మోదీ ఖండించారు. ఈ దాడుల్లో మరణించిన వాళ్లకి సంతాపం తెలిపారు. UAEకి భారత్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

CCS అత్యవసర సమావేశం

ఇదిలాఉండగా ఆదివారం రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశం అయ్యింది. ఈ భేటీలో మిడిల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్ షా, జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్‌పై పడే ప్రభావాన్ని కూడా సీసీఎస్‌ అంచనా వేసినట్లు తెలుస్తోంది. మిడిల్‌ఈస్ట్‌లో భారతీయుల భద్రతపై, అలాగే ఈ దాడులు మరింత తీవ్రతరమైతే చేపట్టాల్సిన ప్రణాళికలపై ఈ మీటింగ్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌ నహ్యాన్‌తో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ దేశంపై జరిగిన దాడులకు సంఘీభావం తెలిపారు. 

Also Read: పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!

ఇదిలాఉండగా ఇరాన్‌లో భారతీయులు 10 వేల మంది ఉన్నారు. ఇజ్రాయెల్‌లో 40 వేల మందికి పైగా ఉన్నారు. ఇక పశ్చిమాసియా, గల్ఫ్‌ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు వల్ల వారి భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ ఎంబసీ అక్కడి వారికి కీలక సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. 

Advertisment
తాజా కథనాలు