/rtv/media/media_files/2025/03/06/SebEgBJJ1uSjxWTYyrLi.jpg)
PAK Vs BLA
PAK Vs BLA: పాకిస్థాన్ ముక్కలు కాక తప్పదా? రైలు హైజాక్ ఘటనతో బలూచ్ స్వాతంత్ర ఉద్యమం మరింత ఊపందుకుందా? ఏళ్ల పోరాటానికి ఇదే సరియైన మూమెంట్ అని బలూచ్ భావిస్తోందా? ఈ పోరాటం కొనసాగిస్తే ఫలితం సాధించొచ్చని బలంగా నమ్మకంతో ఉన్నట్లు వాదానలు వినిపిస్తున్నాయి. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది. ఆ తర్వాత తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పాక్ గవర్నమెంట్‌కి BLA 48 గంటల డెడ్ లైన్ పెట్టింది. గడువు ముగిసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో బందీలుగా తీసుకున్న 214 మంది సైనికులను చంపేసినట్లు BLA ప్రకటించింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే తమ చేతులకు పని చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుంది..
అసలు పాక్‌కి బలూచ్ ప్రాంతానికి మధ్య వివాదానికి కారణాలు ఇలా ఉన్నాయి. పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఆ ప్రాంతం విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని, తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి, క్రూరంగా హత్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం వందలాది గ్రూపులు కూడా అన్ని ఒకే గొడుగు కిందకు చేరాయి.
1973-77 మధ్య భారీ తిరుగుబాట్లు...
నిజానికి బలూచిస్తాన్ వివాదం పాకిస్తాన్, ఇండియా విభజన తర్వాత నుంచి ప్రారంభమైంది. బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో చేరిన వెంటనే.. తిరుగుబాటు ప్రారంభమైంది. 1948, 1973-77 మధ్య భారీ తిరుగుబాట్లు జరిగాయి. 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికల్ అలీ భుట్టో బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి, సైనిక చర్యకు ఆదేశించాడు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అట్టుడుకుతూనే ఉంది. 2005లో సుయ్‌కి చెందిన వైద్యురాలు షాజియా ఖలీద్ అత్యాచారంతో.. మరోసారి బలూచ్ రగిలిపోయింది. అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ కూడా అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించాడు.
పాకిస్థాన్ భూభాగంలో 44 శాతం..
బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం.విస్తీర్ణం పరంగా చూస్తే.. బలూచిస్థాన్ ప్రాంతం పాకిస్థాన్ భూభాగంలో 44 శాతం ఉంటుంది. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి నిక్షేపాలు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది.తమ వనరులని చైనా కొల్లగొడుతుందనే భావనలో ఉన్న బలూచ్ ప్రజలు.. చైనాపై దాడులు చేస్తున్నారు. దానికి తోడు పాక్ ఆర్మీ అకృత్యాలకు లెక్కే లేదు. ఈ ప్రావిన్స్‌లో 20వేల మందికి పైగా పురుషులు, మహిళలు మరియు పిల్లలను చట్టవిరుద్ధంగా నిర్బంధించారని.. సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, పలు సందర్బాల్లో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు.. తమ ప్రాంతాన్ని స్వతంత్రం చేసుకోవడానికి భారత్ సాయం కోరారు.
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
ఒకవేళ పరిస్థితులు అనుకూలించి.. బయటి నుంచి సహాయం అంది.. బలూచిస్థాన్ గనుక స్వాతంత్య్రం సంపాదించుకుంటే గనుక.. అది పాకిస్థాన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే బలూచిస్థాన్ విడిపోతే.. విస్తీర్ణం పరంగా అతి పెద్ద భూభాగాన్ని మాత్రమే కాకుండా.. సహజ వనరులపై ఆధిపత్యాన్ని సైతం పాకిస్థాన్ కోల్పోతుంది. అదే సమయంలో పీఓకే తిరిగి భారత్‌లో అంతర్భాగం కావచ్చు. పాకిస్థాన్ తీర ప్రాంతం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ప్రపంచ పటంలో పాకిస్థాన్ మ్యాప్ చిన్నగా మారిపోవడమే కాదు.. ప్రపంచ రాజకీయాల్లో పాకిస్థాన్ పాత్ర అంతకంటే చిన్నది అవుతుంది. అంతర్గత కుమ్ములాటలు, ఉగ్రవాదుల దెబ్బతో అసలు పాకిస్థాన్ అనే దేశమే కనుమరుగయ్యే పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి