న్యూఇయర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు పలువురు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోలీసులకు దొరికిపోతున్నారు. ముఖ్యంగా ముంబయిలో పెద్ద ఎత్తున ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఒక్కరాత్రిలోనే ఏకంగా 17,800 వాహనాలు రూల్స్ ఉల్లంఘించాయని పోలీసులు తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ముంబయి పోలీసులు బుధవారం తెల్లవారుజాము వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. Also Read: Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి! ట్రాఫిక్ రూల్స్ పాటించనివారికి మొత్తం రూ.89.19 లక్షలు జరిమానా విధించారు. వేగంగా వాహనాలు నడపడం, సిగ్నళ్లు జంప్ చేసి వెళ్లడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే వీటిలో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉండగా.. న్యూఇయర్ వేడకల వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు నిర్వహించారు. 8 మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, అలాగే 2,184 మంది ఇన్‌స్పె్క్టర్లు, 12 వేలకు పైగా కానిస్టేబుళ్లు రోడ్లపై విధుల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇదిలాఉండగా.. కొత్త సంవత్సరం వేళ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. రోడ్డుపై ఓ వాహనం వేగంగా దూసుకురాగా అందులో డ్రైవర్ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపాడని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. Also Read: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి! Also Read: 2025లో 3వ ప్రపంచ యుద్ధం.. బాబావంగా జోష్యం వైరల్!