Indian LPG Ships: మన గ్యాస్ వచ్చేస్తోంది.. హోర్మూజ్‌ జలసంధిని దాటిన భారతీయ నౌకలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తీవ్రమవుతున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో, అంతర్జాతీయ చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ఎక్కడి నౌకలు అక్కడే ఆగిపోయాయి. అంతర్జాతీయ నౌకల రాకపోకలకు వీలుగా హర్మూజ్‌ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది.

New Update
FotoJet (16)

Strait of Hormuz

Indian LPG Ships : పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికా ఇరాన్‌పై దాడులు ఆపకపోగా, ఇరాన్‌ సైతం ఆయా దేశాలను టార్గెట్‌గా చేసుకుని దాడులు(iran israel conflict) తీవ్రం చేసింది. అదే సమయంలో చమురు(indian-oil) ఉత్పత్తికి ప్రధానమైన గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తుండటంతో  చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో, అంతర్జాతీయ చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి(hormuz island) పై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ఎక్కడ నౌకలు అక్కడే ఆగిపోయాయి. అయితే ఈ విషయంలో ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను ఈ మార్గం గుండా ప్రయాణించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

Also Read :  యుద్ధం బీభత్సం...  నిమిషాల్లో 1,430 మిస్సైళ్లతో ప్రళయం!

Indian LPG Ships

అయితే అదే సమయంలో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు వీలుగా హర్మూజ్‌ జలసంధి తెరిచే ఉంటుందని కానీ,  అయితే తమ శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రం ఈ మార్గం గుండా ప్రవేశం ఉండదని ఇరాన్ అధికారులు తెగేసి చెప్పారు. పశ్చిమాసియాలో అమెరికా సాయంతో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులకు నిరసనగా ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంటే మాత్రం జలసంధిని పూర్తిగా మూసివేసే అధికారం కూడా తమకు ఉందని ఇరాన్‌ గతంలోనే స్పష్టం చేసింది. ఇదే సమయంలో  ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయిన భారత్‌కు చెందిన రెండు కీలక ఎల్‌పీజీ (LPG) రవాణా నౌకలు హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ యుద్ధం మూలంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో డ్రోన్ దాడులు, నౌకల హైజాకింగ్ వంటి సమస్యలు పొంచి ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పరిణామాల క్రమంలో భారత ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన చమురు దిగుమతులకు కేటాయించిన 'సిగ్మా గ్యాస్' (Sigma Gas), 'ఎపిక్ బెర్ముడా' (Epic Bermuda) అనే రెండు భారీ ఎల్‌పీజీ క్యారియర్లు ఈ జలసంధిని దాటినట్లు  అధికారుల సమాచారం. ఇవి పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుండి భారత తీరానికి వంటగ్యాస్ (LPG) ని తీసుకువస్తున్నట్లు వారు వెల్లడించారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా జరిగే  మొత్తం చమురు, గ్యాస్ రవాణాలో దాదాపు 20 నుంచి 30శాతం వరకు ఈ చిన్న జలసంధి ద్వారానే జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ సంధి ఇరాన్, ఓమన్ దేశాల మధ్య ఉంటుంది. ప్రపంచ ఇంధన అవసరాలకు ఇది అంత్యంత కీలకమైన ప్రాంతం కాగా, ఈ మార్గంలో ఏదైనా సమస్య ఎదురైతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. ఈ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటు దారుల దాడులు నిరంతంరం ఉంటాయి. అందుకే ఇంధన నౌకల రక్షణకు మనదేశం పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నౌకల భద్రత కోసం భారత నౌకాదళం యుద్ధ నౌకలను ఎప్పుడు మోహరించి ఉంటుంది.

Also Read :  అమెరికా పెద్దన్న పాత్రకు ఇరాన్ దెబ్బ.. ఇరాన్‌ పై దాడితో అమెరికాకు తీవ్ర నష్టం

Advertisment
తాజా కథనాలు