వచ్చే ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను వెళ్లగొడతానని చెప్పారు. చట్టబద్ధంగా అమెరికాకి వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానన్నారు. దీనివల్ల ఇది భారతీయులకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలు వెల్లడించారు. '' అమెరికాలో ప్రవేశం పొందానుకునేవారు ముందాగా ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి చెప్పగలిగేలా ఉండాలి. Also Read: 2024లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికినవి ఇవే పలు దేశాల జైళ్ల నుంచి నేరస్థులు నేరుగా అమెరికాకి వచ్చేస్తున్నారు. మొత్తం 13,099 మంది నేరస్థులు అమెరికా విధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తులను దేశంలో ఉంచకూడదు. వెంటనే తరిమికొట్టాలి. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన దంపతుల సంతానంలో చాలామంది ఇక్కడే పుట్టి పెరిగారు. వాళ్లలో చాలామంది పెద్ద ఉద్యోగాలు, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. వీళ్ల సమస్యను పరిశీలిస్తాం. విపక్ష డెమోక్రాట్లతో కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని'' ట్రంప్ అన్నారు. ఇదిలాఉండగా.. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోల నుంచి అమెరికాకు లక్షలాది మంది అక్రమ వలసదారులు వస్తున్నారని ట్రంప్ తెలిపారు. దీన్ని అరికట్టకపోతే ఆ రెండు దేశాలపై 25 శాతం సుంకం విధిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు దేశాలు దీనిపై ప్రశ్నించగా.. చివరికీ కెనడా, మెక్సికోలు అమెరికాలో 51వ, 52వ రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదంటూ సలహా ఇచ్చారు. Also Read: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు ఇదిలాఉండగా.. అమెరికా ఇప్పటికే మెక్సికోకు 30 వేల కోట్ల డాలర్లు, కెనడాకు 10 వేల కోట్ల డాలర్ల చొప్పున రాయితీలు ఇస్తోందని.. వీటిని ఆపాల్సిన అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే చైనా తదితర దేశాలపై సుంకాలు పెంచినట్లైతే సరకుల ధరలు పెరిగా సామాన్య అమెరికన్ ప్రజలు నష్టపోతారని పలు కంపెనీలు సీఈవోలు హెచ్చరిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం వాటిని తోసిపుచ్చారు. సుంకాల సాయంతోనే తాను యుద్ధాలను ఆపగలిగానని స్పష్టం చేశారు.