వైమానిక దాడులు.. పాకిస్థాన్‌ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్‌ ఫైటర్లు..

ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్‌ ఫైటర్లు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Militants

Militants

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ వైమానికి దాడులు చేయడం వల్లే ఈ పరిస్థితులకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక విషయం బయటపడింది. పాకిస్థాన్‌ సరిహద్దు వైపుగా ఏకంగా 15 వేల మంది తాలిబన్‌ ఫైటర్లు వెళ్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. కాందహార్, హెరాత్‌, కాబుల్‌ నుంచి పాకిస్థాన్‌కు చెందిన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను సరిహద్దు వైపు వీళ్లు వెళ్తున్నారని పేర్కొన్నాయి. 

Also Read: సంభాల్‌లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి   

ఇదిలాఉండగా.. ఇటీవల తూర్పు పక్తికా ప్రావిన్స్‌లో బార్మల్‌ జిల్లాలో నాలుగు గ్రామాలపై పాకిస్థాన్‌ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అనాగరిక చర్య అని తాలిబన్ రక్షణశాఖ ప్రకటించింది. ఈ దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించింది. అయితే ఈ దాడుల్లో వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మృతి చెందినట్లు తెలుస్తోంది.  అయితే పక్తికా రాష్ట్రంలో మిలిటెంట్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న శిబిరాన్ని ధ్వంసం చేసి తిరుగుబాటుదారుల్ని అంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని పాకిస్థాన్ భద్రతా వర్గాలు తెలిపాయి.

Also Read: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే!

మరోవైపు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్‌ (టీటీపీ) గ్రూప్ చేసే చర్యలు ఆటంకం కలిగిస్తున్నాయి. ఒకప్పుడు ఈ గ్రూప్‌కు ఇరుదేశాల మధ్య సంబంధాలు ఉండేవి. అయితే అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పాకిస్థాన్‌ భద్రతా సిబ్బంది, ప్రజలపై ఈ గ్రూప్ దాడులు చేస్తోంది. పాకిస్థాన్‌లో ఇస్లామిక్ ఎమిరేట్‌ను ఏర్పాటు చేయాలని టీటీపీ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో తాలిబన్లను పోషించిన పాకిస్థాన్‌కే ఇప్పుడు వారి నుంచి ఆంటంకాలు ఎదురవుతున్నాయి.  

Also Read: ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

Also Read: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు