భార్య, పిల్లల్ని చంపిన హత్య కేసు.. దోషికి ఉరిశిక్ష
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌కు లేట్ వచ్చిందనే కారణంలో ఓ టీచర్ విద్యార్థినికి బలవంతంగా 100 గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మ-ృతి చెందడం కలకలం రేపింది.
హర్యానాలో జరిగిన పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్సర్లు, పెళ్లి కొడుకు మామ తరపు వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళతో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించడంతో లొల్లి మొదలైంది.
విశాఖలో ఘోరం వెలుగు చూసింది. ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేశారు. అనంతరం ఆ భాగాలను కల్వర్టులో పడేశారు.
కోనసీమజిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివిసరోజ్‌ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అతడిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారంతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి రెండవ బైపాస్ రహదారిలోని మురికి కాల్వలో పడి మృతి చెందినట్లుగా సమాచారం. బైక్‌తో పాటు పడిపోవడంతో యువకుడు మృతి చెందాడు.
ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణతో భార్య హత్య చేశాడు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న భార్య గోగుల సాయివాణిని ఆమె భర్త భాస్కర్ గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.