Fire Accident: మరో ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన బస్సు

జయనగరం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

New Update
Fire Accident in Bus

Fire Accident in Bus

ఈ మధ్య బస్సుల్లో అగ్నిప్రమాదాలు(fire accident) జరుగుతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సు(travels bus) లో అగ్ని ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత బస్సు వెనకాల టైరు పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన డ్రైవర్‌ ప్రయాణికులను కిందకి దించివేశారు.  

Also Read: దారుణం .. బతికి ఉండగానే భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య

Private Travels Bus Fire Accident

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటల వల్ల బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాదు ఈ బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఆ ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే...వైఎస్‌. విజయ సంచలన లేఖ

Advertisment
తాజా కథనాలు