Kerala: కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడు వెళ్లి తిరిగి వస్తుండగా లోయలో బస్సు పడింది. 34 మందితో వెళ్తున్న బస్సులో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Kerala Accident

Kerala Accident Photograph: (Kerala Accident)

కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఘోర బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని తంజావూరు పర్యటన ముగించుకుని కేరళ వెళ్తుండగా.. ముండక్కాయంలో ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకకి చెందిన ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:  కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే..

ఈ బస్సులో దాదాపుగా 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా మావెలిక్కర ప్రాంతానికి చెందిన వారే. మలుపు దగ్గర బస్సు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం వల్లే బస్సులో 30 అడుగుల లోయలో పడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి:  KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు