ఈ మధ్య కాలంలో ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, అప్పుులు, అనుకున్న పనులు కాలేదని, ఉద్యోగం రాలేదని, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా యువతే ఉంటున్నారు. కనీసం ఆలోచించకుండా చిన్న విషయాలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: KTR: వార్తాసంస్థలపై చట్టపరంగా చర్యలు–కేటీఆర్ కూతురు మంచి కోసం చెప్పినా.. టెక్నాలజీ పెరిగి ఉన్నత చదువులు చదువుతున్నా కూడా భవిష్యత్తు విషయంలో అయితే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడం లేదు. కాస్త మనస్తాపం చెందిన కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కూతురు మంచి కోసం తల్లి చెప్పిన వినకుండా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఇది కూడా చూడండి: AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే.. కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని హరనహళ్లికి చెందిన ధనుశ్రీ డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. అయితే ఎక్కువ సమయం మొబైల్ చూడకుండా చదవమని తల్లి మందలించింది. సెల్‌ఫోన్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదని తల్లి చెప్పడంతో.. వెంటనే ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తల్లి గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం! ఇదిలా ఉండగా అప్పుల బాధలు భరించలేక ఇటీవల ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటుచేసుకుంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో రైతు నాగేంద్ర భార్య, ఇద్దరు పిల్లలు నివాసం ఉంటున్నారు. అప్పుల బాధతో రైతు నాగేంద్ర భార్య, ఇద్దరు పిల్లలకు ఉరి వేశాడు. ఆ తర్వాత రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కూడా చూడండి: ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్