Jangaon: లాభాల ఆశ చూపి.. రూ.15 కోట్లు టోకరా

కోస్టా అనే ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడి పెట్టి రూ.15 కోట్లు పోగొట్టుకున్న ఘటన జనగాం జిల్లాలో చోటుచేసుకుంది. లాభాలు వస్తాయని కొందరు ఏజెంట్లు ఆశ చూపించడంతో ఒక్కొక్కరు రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. చివరకు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

New Update
kodada cyber crime

cyber crime Photograph: (cyber crime )

యాప్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపించి టోకరా వేసిన ఘటన జనగామ జిల్లా (Janagaon District) లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో కొందరు ఏజెంట్లు కోస్టా అనే ఆన్‌లైన్‌ యాప్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపారు. దీంతో మొదటిగా కొందరు అందులో డబ్బులు పెట్టారు. లాభాలు రావడంతో చైన్ పద్ధతిలో మరికొందరిని అందులో చేర్చారు.

ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి

లాభాలు వస్తున్నాయని..

ఒక్కోక్కరు ఆ యాప్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. మొదట్లో పెట్టుబడులు (Investments) పెట్టిన తర్వాత లాభాలు చూపించారు. కానీ ఆ తర్వాత యాప్‌లో డబ్బుల విత్‌డ్రా ఆప్షన్‌ తొలగించారు. దీంతో మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించారు. దాదాపుగా రెండు వేల మంది ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. మోసపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చూడండి: RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!

ఇదిలా ఉండగా భార్యతో కాపురం చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేసిన ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌కి చెందిన ఓ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తనతో కలిసి జీవించాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు.

ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య పూర్తిగా మారిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆమెతో పాటు వారి తండ్రి, అన్నదమ్ములిద్దరూ కూడా తనను బెదిరిస్తున్నారని ఆ భర్త పోలీసులకు తెలిపాడు. లేకపోతే వరకట్నం కేసు వేస్తానని భార్య బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు