Jammu Kashmir: జమ్మూలో విషాదం.. ఊపిరాడక ఐదుగురు మృతి

ఊపిరి ఆడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. అకస్మాత్తుగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు గమనించి వైద్యుని తీసుకొచ్చిన ఫలితం లేకపోయింది. హీటర్ కారణంగా జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

New Update
Jammu suffocation

Jammu suffocation Photograph: (Jammu suffocation)

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. శ్రీనగర్ జిల్లాలోని పంద్రథాన్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో ఓ కుటుంబం ఉంటుంది. అకస్మాత్తుగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి వైద్యుని తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది.

ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

ఇది కూడా చూడండి:  KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

హీటర్ కారణంగానే..

డాక్టర్ వచ్చేలోగా ఆ కుటుంబమంతా మృతి చెందారు. అయితే ఈ విషాదానికి హీటింగ్ పరికరాలనే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గ్యాస్ హీటర్లు వంటివి జాగ్రత్తగా ఉపయోగించకపోవడం వల్ల ఊపిరిఆడలేదని అంటున్నారు. ఎందుకంటే హీటర్ల వల్ల కార్బన్ మోనాక్సైడ్‌ ఉత్పత్తి అవుతుంది. దీనిని పీల్చడం వల్ల వెంటనే స్పృహతప్పి పడిపోతారు. హీటర్లు వాడేటప్పుడు లోపలకి వెంటిలేషన్ ఉండాలి. లేకపోయిన కూడా ప్రమాదం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:  కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

ఇది కూడా చూడండి:  నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు