Delhi: ఢిల్లీలో దారుణం.. భార్యను హతమార్చి ఆ తర్వాత ఏం చేశాడంటే?

ఢిల్లీలో నివాసం ఉంటున్న ధనరాజ్ భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఆమెను మంచంలో దాచిపెట్టి పారిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Crime 2

ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బిందాపూర్ ప్రాంతంలో ఓ భర్త తన భార్యను దారుణంగా హతమార్చి శవాన్ని ఇంట్లో ఉన్న మంచంలో దాచిపెట్టిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ద్వారకాలో జాంకీపురిలోని ఎ-16, స్ట్రీట్ నెం.6లోధనరాజ్ తన భార్య దీపతో కలిసి ఉంటున్నాడు. ఐదేళ్ల క్రితం వివాహమైన వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే తన భర్తే భార్యను హతమార్చి మంచంలో లోపల పెట్టి పారిపోయాడు.

ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..

దారుణంగా చంపేసి.. మంచంలో..

ఆ ఇంటి నుంచి గత రెండు రోజుల నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అయితే ధనరాజ్ తన భార్యను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ధనరాజ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఇదిలా ఉండగా తెలంగాణలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలో అనురాగ్ రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. గతంలో మహేందర్‌రెడ్డి, అనురాగ్ రెడ్డి ఒకే హాస్టల్‌లో ఉండేవారట. దీంతో మహేందర్ రెడ్డిని స్నేహితుడు అనురాగ్ రెడ్డి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హాస్టల్‌లో ఉండే కిరణ్‌రెడ్డి అనే వ్యక్తితో మహేందర్‌రెడ్డిని అనురాగ్ దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మహేందర్ రెడ్డి ఈ మధ్యనే హాస్టల్ ఖాళీ చేశాడట. ఆ తర్వాతనే ఇలా జరగడంతో పోలీసులు స్నేహితుడిపై అనుమానిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు