ఓ యువకుడు కూలీ డిమాండ్ చేశాడని దారుణంగా చంపేసిన ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీముల్లాపూర్ గ్రామపంచాయతీకి చెందిన చందన్ యాదవ్(29) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. చిన్న కూలీ పనులు చేస్తే కుటుంబానికి తోడుగా ఉండేవాడు. అయితే సుగెన్ మండల్ అనే వ్యక్తి దగ్గర చందన్ యాదవ్ గతంలో కూలీ పనులు చేశాడు. ఆ డబ్బులను ఇప్పటి వరకు చందన్‌కి ఇవ్వలేదు. ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే కూలీ డబ్బులు అడిగినందుకు.. కూలీ డబ్బులు రూ.10 వేలు చందన్ అడగ్గా.. సుగెన్ అనే వ్యక్తి అతన్ని దారుణంగా హత్య చేశాడు. కొట్టి చంపేసి రోడ్డు పక్కన ఉన్న చెత్తలో పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుమారుడు చనిపోవడంతో కుటుంబమంతా శోకసంద్రంలోకి మునిగిపోయింది. ఇది కూడా చూడండి: KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. శ్రీనగర్ జిల్లాలోని పంద్రథాన్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో ఓ కుటుంబం ఉంటుంది. అకస్మాత్తుగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి వైద్యుని తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది. డాక్టర్ వచ్చేలోగా ఆ కుటుంబమంతా మృతి చెందారు. అయితే ఈ విషాదానికి హీటింగ్ పరికరాలనే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గ్యాస్ హీటర్లు వంటివి జాగ్రత్తగా ఉపయోగించకపోవడం వల్ల ఊపిరి ఆడలేదని అంటున్నారు. ఇది కూడా చూడండి: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా ఇది కూడా చూడండి: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే!