Allu Arjun : పాపం పుష్ప.. టాలీవుడ్ లో ఒంటరైన అల్లు అర్జున్!

సంధ్య థియేటర్ ఘటనలో జైలుకి వెళ్లొచ్చిన్నపుడు అతని కోసం వచ్చిన సినిమా వాళ్ళు.. అదే ఆయన ఇంటిపై దాడి జరిగితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ హీరోని ఒంటరి చేసేశారని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.

New Update
tollywood silence on allu arjun issue

tollywood silence on allu arjun issue

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదం మరింత ముదిరింది. దానికి తోడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మరో చంచలనానికి దారి తీసింది. ఎంతలా అంటే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి జరిగేంతలా.. నిన్న జేఏసీ ఆధ్వర్యంలో పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు.

అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయింది అంటూ జూబ్లీహిల్స్ లోని బన్నీ ఇంటి ముందు ఆందోళన చేశారు. పలువురు విద్యార్థులు ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేసారు. ఇంటిపై టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. పలువురు గోడలు ఎక్కి లోపలికి దిగి బౌన్సర్లతో గొడవ పెట్టుకున్నారు.

బౌన్సర్లు అడ్డుకోవడంతో వారిపై కూడా దాడి చేశారు. రేవతి చావుకు కారణం అల్లు అర్జున్ అని నినాదాలు చేశారు. అయితే ఇప్పటివరకు ఈ దాడిపై ఏ ఒక్క సినీ సెలెబ్రిటీ రియాక్ట్ అవ్వలేదు. ఆ మధ్య అల్లు అర్జున్ ఒక్క రోజు జైలుకి వెళ్లి బయటికొచ్చాక.. ఆయనకు ఏదో జరిగిపోయినట్లు సినిమా వాళ్లంతా అతని ఇంటికి పరామర్శకు వెళ్లారు. 

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నుంచి మొదలు పెడితే చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి.. ఇలా చాలా మంది బన్నీ ఇంటికి వెళ్లారు.

ఇండస్ట్రీ అంతా సైలెంట్..

కానీ అదే అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగితే.. కనీసం ఒక్కరు కూడా ఖండించలేదు. అటు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై చేసిన ఆరోపణలపై కూడా ఎవ్వరూ నోరు మెదపలేదు. ఇలాంటి టైంలో సినిమా వాళ్లంతా ఎందుకు సైలెంట్ అయ్యారు?..

తెలుగు ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు తీసుకొచ్చి పరిశ్రమ గౌరవాన్ని మరింత పెంచిన హీరోకు ఇన్ని ఇబ్బందులు తలెత్తు తుంటే.. సినిమా వాళ్ళు మాత్రం ఏం ఎరుగనట్లు ఎందుకున్నారు? ఈ ఇష్యూలో వేలుపెడితే వివాదం పెద్దదవుతుందని అనుకుంటున్నారా?.. 

Also Read : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే

లేక తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుకోవడం ఎందుకని భయపడుతున్నారా? బన్నీ వ్యవహారంలో సినిమా వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారో తెలీదు కానీ, ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని సినిమా వాళ్లంతా ఒంటరి వాడ్ని చేసేశారని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు