Hyderabad Police: అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన వాదనలు..!

సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి కేసులో సినీనటుడు అల్లు అర్జున్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ ని నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది.ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు..తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది.

New Update
allu arjun going to police station

allu arjun

Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి  కేసులో సినీనటుడు అల్లు అర్జున్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. బెయిల్‌ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు.

Also Read: Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు!

అల్లు అర్జున్‌ తరుఫున న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలంటూ  వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలను విన్న  కోర్టు..తీర్పును జనవరి  3కి వాయిదా వేసింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్‌ ను అరెస్ట్‌ చేసి బెయిల్‌ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Also Read: India vs Australia 4th Test: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే!

హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.మరోవైపు నాంపల్లి న్యాయస్థానం 14రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.ఈ నెల 27 న రిమాండ్‌ముగియగా..అదే రోజు ఆయన వర్చువల్‌ గా కోర్టుకు హాజరయ్యారు.

Also Red: Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి

అప్పుడే అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ పై విచారణ నేటికి వాయిదా పడింది.దీంతో నాంపల్లి కోర్టు నేడు విచారణ చేపట్టి తీర్పునిచ్చింది.

Also Read: Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి!

ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు..

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనా నేపథ్యంలో పోలీసులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 'పుష్ప 2' ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ తన కుటుంబసభ్యులతో పాటు హీరోయిన్ రష్మిక థియేటర్‌కు హాజరయ్యారు. 

ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకోవడంతో భారీ గందరగోళం నెలకొంది. ఆ హడావిడిలో తొక్కిసలాట జరగ్గా.. దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు

"తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరించండి" అని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే, లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు