అబద్ధాలు చెప్పకు పుష్ప.. ఇదిగో ప్రూఫ్.. కాంగ్రెస్ నేత సంచలన వీడియో

అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేత బల్మూర్ వెంకట్ ధ్వజమెత్తారు. తప్పు చేసిందే కాకుండా మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెప్పాడని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ సినిమా హల్లో ఎంత సేపు ఉన్నాడో, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో ఫుటేజ్ ఉందన్నారు.

New Update
Allu Arjun Balmoor Venkat

బల్మూర్ వెంకట్, అల్లు అర్జున్ (ఫైల్ ఫొటో)

అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే పశ్చాతాపం ప్రకటిస్తాడని అనుకున్నామన్నారు.  అల్లు అర్జున్ సినిమా హల్లో ఎంత సేపు ఉన్నాడో, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో ఫుటేజ్ ఉందన్నారు. తెలుగు వాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా? అని ప్రశ్నించారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఫైర్ అయ్యారు. 
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!

నిన్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు చెప్పిన తర్వాత కూడా అర్లు అర్జున్ సరిగా స్పందించలేదని ఫైర్ అయ్యారు. అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి.. ఈ ఘటన ఓ యాక్సిడెంట్ అని, ఇందులో ఎవరి తప్పు లేదని వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకు తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

ఇది కూడా చదవండి: ఏపీలో మళ్లీ భూకంపం

బన్నీపై నెటిజెన్ల ఫైర్..

తన క్యారెక్టర్ పై దెబ్బ కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. నిన్న సాయంత్రం నుంచి అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. థియేటర్లో అల్లు అర్జున్ ఉన్న వీడియోను, బయటకు వచ్చిన తర్వాత ఆయన కార్ రూఫ్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కు అభివాదం చేసిన వీడియోలను షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: కాంగో నదిలో పడవ బోల్తా..వందమందికి పైగా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు