Pushpa 2: యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా?

'పుష్ప2'లోని గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్‌ను మూవీ టీమ్ యూట్యూబ్ లో విడుదల చేసింది. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ సాంగ్‌ భారీ వ్యూస్ అండ్ లైక్స్ తో దూకుసుపోతుంది. ఈ పాటను తెలుగుతో పాటూ తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్స్ ను సైతం రిలీజ్ చేశారు.

New Update

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' (Pushpa 2) మూవీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5 న రిలీజైన ఈ సినిమా సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. 

ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం తాజాగా ఇప్పటి వరకు రూ.1799 కోట్లు గ్రాస్ వసూలు చేసి  సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. త్వరలోనే బాహుబలి 2 రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పాటలు, ముఖ్యంగా అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అందులోనూ, గంగమ్మ తల్లి జాతర సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ (Allu Arjun) ఆడవేషంలో గంగమ్మ తల్లి జాతరలో చేసిన డ్యాన్స్, ఫైట్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఎపిసోడ్ నార్త్ ఇండియా ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకర్షించింది. 

Also Read :  140 Kmph వేగంతో స్టార్క్ బంతి..రిషబ్ పంత్ చేతికి గాయం

కొంతమంది ఈ ఎపిసోడ్ చూసేందుకు సినిమా మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లడం గమనార్హం. ఈ గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్‌ను మూవీ టీమ్ తాజాగా యూట్యూబ్ లో విడుదల చేసింది. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ సాంగ్‌ భారీ వ్యూస్ అండ్ లైక్స్ తో దూకుసుపోతుంది.  ఈ పాటను తెలుగుతో పాటూ మిళ్, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్స్ ను సైతం రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు