టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీస్ లు బన్నీ ఇంటి కి చేరుకున్నారు. కాగా అల్లు అర్జున్ తన లాయర్‌తో కలిసి ఈ విచారణలో పాల్గొననున్నాడు. ఇందులో సంధ్య థియేటర్ ఘటన, ప్రెస్‌మీట్‌పై పోలీసులు.. అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్‌ను తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్‌మీట్ పెట్టడంపైనా ఇప్పటికే పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. 🔴 Allu Arjun Case Live Updates: మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ విచారణ మరోవైపు అల్లు అర్జున్ ఇటీవల పెట్టిన ప్రెస్‌మీట్‌లో పోలీసులదే తప్పు అనడంపై ఆగ్రహంలో ఉన్న పోలీసులు అల్లు అర్జున్‌కు BNS 35(3) కింద నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఈ కేసులో అల్లు అర్జున్ A11గా చేర్చారు.