సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి హామీ ఇస్తూ..

సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌ స్పందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. తన వంతుగా రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
allu arjun02

'పుష్ప-2' మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు. 

దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఎట్టకేలకు ఈ ఘటనపై అల్లు అర్జున్‌ స్పందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు! 


" మేము పుష్ప2’ ప్రీమియర్‌ షోకి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లాం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలినట్లు మర్నాడు ఉదయం తెలుసుకున్నాం. ఈ ఘటనలో ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయారని తెలియగానే మా చిత్ర బృందమంతా దిగ్భ్రాంతికి గురయ్యింది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటమనేది గత 20ఏళ్లుగా నాకు ఆనవాయితీగా వస్తోంది. 

Also Read: Telangana: ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి

ఆ  లోటు తీర్చలేనిది..

కానీ, ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి విషాద ఘటన జరగడం బాధగా ఉంది. రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మేము ఎంత చేసినా ఆమె లేని లోటు తీర్చలేనిది. నా తరఫున వారి కుటుంబానికి రూ.25లక్షలు సాయం అందివ్వాలని నిర్ణయించుకున్నా. ఆ కుటుంబానికి నా తరఫున ఇంకెలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటా.." అని వీడియోలో పేర్కొన్నాడు.

Also Read:  విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్

Also Read: Ap: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు