Ola Electric Bikes: ఓలా కుమ్ముడు.. రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ దింపేసిందిగా.. సింగిల్ ఛార్జింగ్‌పై 500 కి.మీ మైలేజ్!

ఓలా తాజాగా తన రోడ్‌స్టర్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేసింది. ఓలా రోడ్‌స్టర్ X ధరలు రూ. 74,999 నుండి, అలాగే రోడ్‌స్టర్ X+ ధరలు రూ. 1,04,999 నుండి ప్రారంభం అవుతాయి. ఎక్స్ టాప్ రేంజ్ 252 కి.మీ కాగా.. ఎక్స్ ప్లస్ టాప్ రేంజ్ 501కి.మీగా ఉంది.

New Update
Ola Electric launched Roadster X and Roadster X+ Electric Motorcycles

Ola Electric launched Roadster X and Roadster X+ Electric Motorcycles

Ola Electric Bikes: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఓలా.. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌లపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ తన రోడ్‌స్టర్ X(Ola Electric Road Star X), రోడ్‌స్టర్ X+ (Ola Electric Road Star X+)ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. 

వీటి ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఓలా రోడ్‌స్టర్ X రూ. 74,999 ఎక్స్-షోరూమ్ ధరల నుండి ప్రారంభమవుతాయి. అదే సమయంలో రోడ్‌స్టర్ X+ రూ.1,04,999 ఎక్స్-షోరూమ్ ధరల ప్రారంభమవుతాయి. వీటికి సంబంధించిన బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి.

ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఇంటిగ్రేటెడ్ MCUతో కూడిన మిడ్-డ్రైవ్ మోటార్, ఫ్లాట్ కేబుల్స్, ABS, బ్రేక్-బై-వైర్, మూడు రైడింగ్ మోడ్‌లు, అధునాతన బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్ వంటి ఇతర లక్షణాలను ఎనేబుల్ చేసే మూవ్ OS 5 వంటి అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. రోడ్‌స్టర్ X 4.3-అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. 

Also Read:  కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

రోడ్‌స్టర్ X

అందులో 2.5kWh బ్యాటరీ ఉంటుంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని ధర రూ.74,999గా ఉంటుంది. 

అలాగే 3.5kWh బ్యాటరీ ఉంటుంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 196 కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని ధర రూ.84,999గా నిర్ణయించారు. 

ఇక చివరిగా 4.5kWh బ్యాటరీ. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 252 కిమీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీని ధరను కంపెనీ రూ.95,999గా నిర్ణయించింది. ఈ బ్యాటరీ ప్యాక్‌లు 9.38bhp మిడ్-మౌంటెడ్ మోటారుకు అనుసంధానించబడి ఉంటాయి. 

Also Read:  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

రోడ్‌స్టర్ X +

అలాగే రోడ్‌స్టర్ X+ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. 

4.5kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్‌పై 252 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ధరను కంపెనీ రూ.1.05 లక్షలుగా నిర్ణయించింది. 

అలాగే 9.1kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్ పై 501కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని ధర రూ.1.55 లక్షలుగా ఉంది.

Also Read:  TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

ఈ రెండు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌లలో ఫీచర్లు అదిరిపోయాయి. రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లో  స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అలాగే రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బైక్‌లో అడ్వాన్స్‌డ్ రీజెన్, ఎనర్జీ ఇన్‌ సైట్స్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్స్ ఉంటాయి. దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో పొందొచ్చు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు