/rtv/media/media_files/2025/03/02/X7Jr69YCa39BNFzLGK1p.jpg)
Jio Hotstar free subscription 5 cheap plans
ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. చాలా మంది క్రికెట్ ప్రియులు, అభిమానులు మ్యాచ్‌లను చూడటానికి ఫ్రీ స్ట్రీమింగ్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో స్పెషల్ ఆఫర్‌ల కోసం చూస్తున్నారు. మీరు కూడా అలాంటి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంటే అదిరిపోయే ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ Jio, వొడాఫోన్ ఐడియా (Vi) టెలికాం కంపెనీలు చౌకైన ప్లాన్‌లు అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లో కస్టమర్లు 3 నెలల ప్రీమియం JioHotstar యాక్సెస్ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
జియో రూ.195 ప్లాన్
Jio ఇటీవల రూ. 195 క్రికెట్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇది మూడు నెలల కాంప్లిమెంటరీ JioHotstar సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వాలిడిటీని ఇస్తుంది. అయితే కేవలం డేటా మాత్రమే. ఇది 15GB 4G/5G డేటాతో వస్తుంది. యాడ్-సపోర్టెడ్ JioHotstar మొబైల్ ప్లాన్‌కి ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులను HD రిజల్యూషన్‌లో ఒకేసారి ఒక డివైజ్‌లో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది.
ఇది కూడా చూడండి: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..
జియో రూ.949 ప్లాన్
కంపెనీ గత వారం ఈ స్పెషల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. ఇది 2GB 4G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 100 SMS, అపరిమిత 5G డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ మూడు నెలల కాంప్లిమెంటరీ JioHotstar సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
Vi రూ.151 ప్లాన్
వొడాఫోన్ ఐడియా ఫ్రీ JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. కంపెనీ కేవలం రూ.151 యాడ్-ఆన్ ప్లాన్‌లో 4GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో JioHotstar మొబైల్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ 3 నెలల పాటు అందుబాటులో ఉంటుంది.
ఇది కూడా చూడండి: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
VI రూ.169 ప్లాన్
ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు మొత్తం 8GB డేటాను పొందుతారు. JioHotstar మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ 3 నెలల పాటు అందుబాటులో ఉంది.
VI రూ. 469 ప్రీపెయిడ్ ప్లాన్
వొడాఫోన్ ఐడియా మరో ప్లాన్ అందిస్తుంది. అదే రూ. 469 ప్లాన్. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 2.5GB డేటా, 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్‌లతో వస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు 3 నెలల ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు.