ప్రముఖ చెయిన్ డీమార్ట్ కంపెనీ కొత్త ఏడాదిలో లాభాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా.. డీమార్ట్ షేర్లు మాత్రం లాభాల్లో నడుస్తున్నాయి. డీమార్ట్ పేరుతో వ్యాపారం చేస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ షేర్లు 15 శాతం పెరిగి అవుట్ పెర్ఫార్మ్ రేటింగ్‌తో లాభాల్లో ఉంది. ప్రస్తుతం డీమార్ట్ ఒక్కో షేర్ ధర రూ.5,360గా ఉంది. దీంతో క్యూ3లో స్టాండలోన్‌లో కంపెనీ ఆదాయం రూ.15,565.23 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే డీమార్ట్ దాదాపుగా 17.4 శాతం వృద్ధి చెందింది. గతంలో డీమార్ట్ స్టోర్లు 377 ఉండగా.. ప్రస్తుతం 387 ఉన్నాయి. ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా.. DMart shares skyrocket at 15% after Q3 update shows 17% YoY revenue growth#DMart pic.twitter.com/UnzptWRhlc — Abhay 𝕏 (@Kings_Gambit__) January 3, 2025 ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ నికర లాభంగా రూ.710 కోట్లు.. గతేడాది ఇదే సమయంలో రూ.12,308 కోట్లతో పోలిస్తే ఎఫ్‌వై24 రెండో త్రైమాసికంలో కంపెనీ స్టాండ్‌లోన్ ఆదాయం రూ.14,050 కోట్లకు ఏడాది ప్రాతిపదికన 14.2% పెరిగింది. FY25 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ.710 కోట్లుగా ఉంది. గతేడాదిఇదే త్రైమాసికంలో రూ.659 కోట్లతో పోలిస్తే 7.9% వృద్ధి. నికర లాభ మార్జిన్ Q2 FY24లో 5.3% నుండి Q2 FY25లో 5%గా ఉంది. డీమార్ట్ స్టాక్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 18% రాబడి వచ్చింది. అయితే గత నెలలో స్టాక్ 8% పెరిగింది. అయితే గతంలో 13 శాతం కంటే ఎక్కువ స్టాక్స్ నష్టాల్లోకి పోగా.. ఈ ఏడాది స్టాక్స్ 17% లాభాలను ఇచ్చింది. ఇది కూడా చూడండి: Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఇది కూడా చూడండి: Dehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే